విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న జంటగా నటించిన ‘రణబాలి’ సినిమా నుంచి ‘ఏందయ్యా సామీ’ ఫుల్ వీడియో సాంగ్ విడుదలైంది. ఇప్పటికే థియేటర్లలో ప్రేక్షకులను అలరించిన ఈ పాట పూర్తి వీడియోను చిత్రబృందం తాజాగా విడుదల చేసింది.
రాహుల్ సంకృత్యన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి అజయ్–అతుల్ సంగీతం అందించారు. రామజోగయ్య శాస్త్రి సాహిత్యం అందించగా, అజయ్ గోగవాలే, శ్వేతా మోహన్ పాటను ఆలపించారు. విజయ్, రష్మిక మధ్య కెమిస్ట్రీ ఈ పాటకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది.

