రాష్ట్రంలో కొత్త సాగునీటి ప్రాజెక్టుకు శ్రీకారం
ఐదు జిల్లాల్లో లక్షల ఎకరాలకు సాగునీరు అందించే లక్ష్యంతో కొత్త ప్రాజెక్టు పనులు ప్రారంభమయ్యాయి.
స్టాఫ్ రిపోర్టర్•
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన సాగునీటి ప్రాజెక్టు పనులకు ముఖ్యమంత్రి శంకుస్థాపన చేశారు. మూడేళ్లలో పనులు పూర్తి చేస్తామని ప్రకటించారు.
ప్రాజెక్టు పూర్తయితే ఐదు జిల్లాల్లోని రైతులకు ఏడాది పొడవునా నీటి లభ్యత ఉంటుందని అధికారులు తెలిపారు.
షేర్ చేయండి
