పార్లమెంట్‌లో కొత్త బడ్జెట్ ప్రవేశపెట్టిన కేంద్రం
రైతులు, మధ్యతరగతి కుటుంబాలకు పెద్దపీట వేస్తూ కేంద్ర ప్రభుత్వం కొత్త బడ్జెట్‌ను ప్రవేశపెట్టింది.
ప్రత్యేక ప్రతినిధి•
కేంద్ర ఆర్థిక మంత్రి పార్లమెంట్‌లో ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో వ్యవసాయం, విద్య, ఆరోగ్య రంగాలకు అధిక కేటాయింపులు జరిపారు.
మధ్యతరగతి వేతన జీవులకు పన్ను మినహాయింపు పరిమితిని పెంచడం ఈ బడ్జెట్‌లో కీలక అంశంగా నిలిచింది. మౌలిక సదుపాయాల కల్పనకు రికార్డు స్థాయిలో నిధులు కేటాయించారు.
రాష్ట్రాలకు గ్రాంట్ల రూపంలో అందించే మొత్తాన్ని కూడా పెంచినట్లు ప్రకటించారు.
షేర్ చేయండి
