ఆంధ్ర ప్రదేశ్ లో మంత్రులకు శాఖలు ఖరారయ్యాయి. పవన్ కల్యాణ్ కు డిప్యూటీ సీఎం హోదాలో పంచాయితీ రాజ్, రూరల్ డెవలప్‌మెంట్, తాగునీటి సరఫరా, అటవీ మరియు పర్యావరణ శాఖలను అప్పగించారు. దళిత మహిళ వంగలపూడి అనితకు హోం శాఖను ప్రకటించారు. నిమ్మల రామానాయుడుకు ఇరిగేషన్ కేటాయించారు. ఫరూక్ కు మైనార్టీ సంక్షేమం, న్యాయ శాఖలను అప్పగించారు. పయ్యావుల కశవ్ కు ఆర్థిక శాఖ ఖరారు చేశారు. ఆనం రామనారాయణ రెడ్డికి దేవాదాయ శాఖను ప్రకటించారు.
పవన్ కల్యాణ్
పవన్ కల్యాణ్ కు డిప్యూటీ సీఎం హోదాలో పంచాయితీరాజ్, రూరల్ డెవలప్‌మెంట్, తాగునీటి సరఫరా, అటవీ-పర్యావరణ శాఖలను అప్పగించారు.
వంగలపూడి అనిత
దళిత మహిళ వంగలపూడి అనితకు హోం శాఖను ప్రకటించారు.
నిమ్మల రామానాయుడు
నిమ్మల రామానాయుడుకు ఇరిగేషన్ (పంట నీటి పథకాలు) శాఖను కేటాయించారు.
ఫరూక్
ఫరూక్ కు మైనార్టీ సంక్షేమం, న్యాయ శాఖను అప్పగించారు.
పయ్యావుల కశవ్
పయ్యావుల కశవ్ కు ఆర్ధిక శాఖను ఖరారు చేశారు.
ఆనం రామనారాయణ రెడ్డి
ఆనం రామనారాయణ రెడ్డికి దేవాదాయ శాఖను ప్రకటించారు.
నాదెండ్ల మనోహర్
నాదెండ్ల మనోహర్ కు పౌర సరఫరాల శాఖను కేటాయించారు.
అచ్చెన్నాయుడు
పార్టీ ఏపీ అద్యక్షుడు అచ్చెన్నాయుడుకు వ్యవసాయం శాఖను కేటాయించారు.
కొల్లు రవీంద్ర
కొల్లు రవీంద్రకు గనుల శాఖను అప్పగించారు.
నారాయణ
నారాయణకు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ శాఖను అప్పగించారు.
సత్యకుమార్
సత్యకుమార్ కు వైద్య-ఆరోగ్య శాఖను అప్పగించారు.
నారా లోకేష్
నారా లోకేష్ కు విద్యా శాఖ, ఐటీ శాఖలను చంద్రబాబు కేటాయించారు.
అనగాని సత్యప్రసాద్
అనగాని సత్యప్రసాద్ కు రెవిన్యూ, రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్ శాఖలను ఖరారు చేసారు.
పార్ధసారధి
పార్ధసారధికి హౌసింగ్ అండ్ సమాచార శాఖలను అప్పగించారు.
డాక్టర్ డోలా బాల వీరాంజనేయ స్వామి
డాక్టర్ డోలా బాల వీరాంజనేయ స్వామికి సాంఘిక సంక్షేమం, వికలాంగుల సంక్షేమంతో పాటుగా సచివాలయం-వాలంటీర్ల బాధ్యతలను అప్పగించారు.
గొట్టిపాటి రవికుమార్
గొట్టిపాటి రవికుమార్ కు ఇంధన శాఖను కేటాయించారు.
కందుల దుర్గేష్
కందుల దుర్గేష్ కు టూరిజం, కల్చర్, సినిమాటోగ్రఫీ శాఖలను ప్రకటించారు.
గుమ్మడి సంధ్యారాణి
గుమ్మడి సంధ్యారాణికి మహిళా-శిశు, గిరిజన సంక్షేమ శాఖలను అప్పగించారు.
బీసీ జనార్ధన్ రెడ్డి
బీసీ జనార్ధన్ రెడ్డికి రోడ్లు-రహదారులతో పాటుగా పెట్టుబడులు, మౌళిక వసతులు శాఖలను కేటాయించారు.
టీజీ భరత్
టీజీ భరత్ కు పరిశ్రమలు, వాణిజ్య శాఖలను కేటాయించారు.
సబిత
సబితకు బీసీ సంక్షేమం తో పాటుగా చేనేత-జౌళి శాఖలను ఖరారు చేసారు.
వాసంసెట్టి సుభాష్
వాసంసెట్టి సుభాష్ కు కార్మిక శాఖను ఖరారు చేసారు.
కొండపల్లి శ్రీనివాస్
కొండపల్లి శ్రీనివాస్ కు చిన్న తరహా పరిశ్రమలు, సెర్ఫ్, ప్రవసాంధ్ర వ్యవహారాలను కేటాయించారు.
మండిపల్లి రాం ప్రసాద్ రెడ్డి
మండిపల్లి రాం ప్రసాద్ రెడ్డికి రవాణా, యువజన సర్వీసులు శాఖలను అప్పగించారు.