ఆంధ్రప్రదేశ్ లో 70 వేల వాలంటీర్ల నియామకం
ఆంధ్రప్రదేశ్‌లో భారీగా 70 వేల వాలంటీర్ల నియామకం కోసం కొత్త నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు. ఈ నియామకాల విధివిధానాలు, అర్హతలు, ఎంపిక విధానం, వేతనాలు మొదలైన వివరాలను ఇక్కడ చూడండి.
AP వాలంటీర్ నియామకం 2024 అర్హతలు
ప్రస్తుతానికి పదవ తరగతి అర్హత ఉన్న వాలంటీర్ల నియామకాలు జరుగుతున్నాయి. అయితే, కొత్త ప్రభుత్వం ఇంటర్ లేదా డిగ్రీ అర్హతకు పెంచాలని యోచిస్తోంది. అధికారిక సమాచారం కోసం కొంత సమయం వేచి చూడాల్సి ఉంటుంది.
AP వాలంటీర్ నియామకం 2024 వేతనం
గతంలో వాలంటీర్ ఉద్యోగానికి 5000 రూపాయలు జీతం ఇచ్చేవారు. కొత్త ప్రభుత్వం పదివేల రూపాయలు వేతనం ఇవ్వనున్నట్లు సమాచారం ఉంది.
AP వాలంటీర్ నియామకం 2024 డాక్యుమెంట్లు
వాలంటీర్ ఉద్యోగాలకు కావాల్సిన డాక్యుమెంట్లు:
- 10/ఇంటర్/డిగ్రీ సర్టిఫికెట్లు
- ఆధార్ కార్డు
- కుల ధ్రువీకరణ పత్రం
- బ్యాంక్ పాస్ బుక్
- పాస్పోర్ట్ సైజ్ ఫోటో
AP వాలంటీర్ నియామకం 2024 ఎంపిక విధానం
వాలంటీర్ నియామకాల్లోకి ఎంపిక కోసం ఇంటర్వ్యూ నిర్వహించే అవకాశం ఉంది.
ఎన్ని ఇండ్లకు ఒక వాలంటీర్
ప్రస్తుతం, ఒక వాలంటీర్ కు 50 ఇండ్లు కేటాయిస్తున్నారు. కొత్త విధానంలో, 300 సిటిజన్స్‌కు ఒక వాలంటీర్ లేదా 300 ఇండ్లకు ఒక వాలంటీర్ కేటాయించనున్నారు.
AP వాలంటీర్ నియామకం 2024 ఖాళీలు
మొత్తం ఒక లక్ష ఖాళీలు ఉన్నాయి. ప్రస్తుతం 70 వేల ఖాళీలు భర్తీ చేయనున్నారు.
AP వాలంటీర్ ఉద్యోగ విధులు
గతంలో వాలంటీర్ వారానికి మూడు రోజులు మాత్రమే సచివాలయం సందర్శించేవారు. ఇప్పుడు ప్రతిరోజు సచివాలయం లేదా మండల ఆఫీసు సమావేశాలకు హాజరుకావాల్సి ఉంటుంది.
AP వాలంటీర్ నియామకం 2024 ఎలా దరఖాస్తు చేయాలి
వాలంటీర్ ఉద్యోగాలకు ఆన్లైన్లో దరఖాస్తు సమర్పించవచ్చు. అధికారిక నోటిఫికేషన్, అప్లై లింకు, పూర్తి నిబంధనలు త్వరలో జూలై మొదటి లేదా రెండవ వారంలో విడుదలయ్యే అవకాశం ఉంది.