ఉచిత బస్సు, రూ.7,000 పింఛను, నిరుద్యోగ భృతి, నెలకు రూ .1500 పథకాలు పై కొత్త ప్రకటన

AP Super Six Schemes Update: ఆంధ్రప్రదేశ్‌లో కొత్త సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడింది. కొన్ని వాగ్దానాలను అమలు చేయడానికి ఆరు నెలల సమయం అవసరమని కొందరు అంటున్నారు. కానీ ప్రజలు సంతోషంగా లేరు. వారికి తక్షణ సమస్యలు ఉన్నాయి. ఆరు నెలలు నిరీక్షించడం కష్టం. వాగ్దానాలు ఎప్పుడు అమలు చేస్తారా అని ప్రజలు ఎదురు చూస్తున్నారు.

ap government scheme new update

పెన్షన్ అమలు

ఈరోజు జూన్ 23. ఇంకా ఒక వారం రోజుల్లో ఏపీ ప్రజలకు పింఛను ఇవ్వాలి. అది కూడా మామూలుగా కాదు, నెలకు 4,000 ఇవ్వాలి. అదనంగా ఏప్రిల్, మే, జూన్ నెలలకు మరో రూ. 3 వేలు, అంటే మొత్తం రూ. 7,000 ఇవ్వాలి. దీనిపై ప్రభుత్వం ఇంకా స్పష్టత ఇవ్వలేదు. చంద్రబాబు ఎన్నికల సమయంలో జూలైలో 7,000 ఇస్తామని చెప్పారు. ప్రజలు ఆ వాగ్దానాల అమలుపై స్పష్టత కోరుతున్నారు.

బాబు సూపర్ సిక్స్ పథకాలు

అదేవిధంగా, సూపర్ సిక్స్ వాగ్దానాల అమలుపై కూడా ప్రజలు ఎదురుచూస్తున్నారు. ముఖ్యంగా మహిళలు, తెలంగాణ తరహాలో, అధికారంలోకి వచ్చిన వెంటనే ఉచిత బస్సు ప్రయాణ పథకాన్ని అమలు చేయాలని కోరుతున్నారు. ఏపీ ప్రభుత్వం ఈ పథకం గురించి చర్చ జరపలేదు. తెలంగాణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రోజే అమలు చేయడం వల్ల, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా అదే చేయాలని మహిళలు డిమాండ్ చేస్తున్నారు.

మహిళలకు నెలకు రూ. 1500

మహిళలకు నెలకు రూ. 1500 ఇస్తామని హామీ ఇచ్చారు కానీ, ఇప్పటివరకు ప్రభుత్వం నోరు మెదపలేదు. ఈ వాగ్దానాన్ని అమలు చేయడంలో ఆలస్యం చేస్తే, ప్రజలు ఆందోళన చెందవచ్చు. సంకీర్ణ ప్రభుత్వం గెలవడానికి మహిళలు ముఖ్య కారణం. వారు పెద్ద ఎత్తున తరలివచ్చి, తమ మద్దతు అందించారు. అందువల్ల, ప్రభుత్వం వారి వాగ్దానాలను తక్షణమే అమలు చేయాలి.

నిరుద్యోగ భృతి

నిరుద్యోగ భృతి కూడా ఒక ప్రధాన అంశం. ఏపీలో ఉద్యోగాల కొరత ఉంది. గత ప్రభుత్వం ఉపాధి కల్పనలో విఫలమైంది. మెగా డీఎస్సీ కూడా అమలు కాలేదు. కొత్త ప్రభుత్వం ఏర్పాటు అయినా తర్వాత మెగా డీఎస్సీని ప్రకటించింది కానీ, ఇతర ఉద్యోగాలకు ఇంకా ఎటువంటి హామీ ఇవ్వలేదు. కావున నెలవారీ నిరుద్యోగ భృతి రూ.3,000 ఇవ్వాలని నిరుద్యోగులు ఆశిస్తున్నారు. దీనిపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలి.

ప్రాజెక్టులు మరియు కేబినెట్ సమావేశం

ప్రజల ఆగ్రహం ఎదుర్కోకుండా ప్రభుత్వం తక్షణమే ప్రణాళికలు అమలు చేయాలని భావిస్తోంది. జూన్ 24న ఏపీ ప్రభుత్వ కేబినెట్ సమావేశం జరగనుంది. ఇందులో ఎన్నికల హామీలు, అమరావతి నిర్మాణం, పోలవరం ప్రాజెక్టు, ఇతర ముఖ్యమైన అంశాలపై చర్చించనున్నారు. కేబినెట్ భేటీ తర్వాత వెలువడే ప్రకటనలు కీలకం కానున్నాయి.

Scroll to Top