AP Deputy Chief Minister: ఏపీ ఉపముఖ్యమంత్రిగా పవన్ కోసం ప్రత్యేక కార్యాలయం ఎంపిక చేసిన చంద్రబాబు..!
శాఖలు పవన్ కోరుకున్న విధంగా దక్కాయి
AP Deputy Chief Minister: ఇప్పటికే పవన్ కోరుకున్న విధంగా శాఖలు దక్కాయి. తన మనసుకు నచ్చిన శాఖలను నిర్వహిస్తున్నానని పవన్ చెప్పుకొచ్చారు. కూటమి గెలుపులో కీలకంగా వ్యవహరించిన పవన్ కు ప్రతీ అంశంలోనూ చంద్రబాబు ప్రాధాన్యత ఇస్తున్నారు. ఉప ముఖ్యమంత్రి హోదా పవన్ కు మాత్రమే ఇచ్చారు.
కార్యాలయం విషయంలో కీలక ఆదేశాలు
ఇప్పుడు పవన్ విధుల నిర్వహణ కోసం కార్యాలయం విషయంలోనూ చంద్రబాబు కీలక ఆదేశాలు ఇచ్చారు. పవన్ కార్యాలయం ఉపముఖ్యమంత్రి హోదాలో పవన్ కల్యాణ్ కీలకమైన పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, ఆర్‌డబ్ల్యూఎస్, అటవీ, పర్యావరణం, శాస్త్రసాంకేతిక శాఖల్ని నిర్వహించనున్నారు.
సచివాయలంలో చాంబర్ కేటాయింపు
సీఎం తర్వాత ఎక్కువ శాఖలు పవన్ కల్యాణ్ వద్ద ఉండటంతో ఆయనకు సచివాయలంలో కేటాయించే కార్యాలయంపై చంద్రబాబు ఆరా తీసారు. దీని పైన కీలక సూచనలు చేసారు. ముఖ్యమంత్రి కార్యాలయం ఉండే బ్లాక్ -1 లోనే పవన్ కు పెద్ద చాంబర్ ను సిద్దం చేయాలని సూచించారు. దీంతో, పవన్ పేషీలో పని చేసే ఓఎస్డీలు, సెక్రటరీలు, ఇతర అధికారులకు అనుకూలంగా ఉండేలా ఛాంబర్ సిద్ధమవుతోంది.
చంద్రబాబు సూచనలు
చంద్రబాబు సూచన ఇప్పటికే పవన్ కు ప్రత్యేకంగా గౌరవం కల్పిస్తూ చంద్రబాబు పలు నిర్ణయాలు తీసుకుంటున్నారు. గ్రామ పంచాయితీ నుంచి రాష్ట్ర సచివాలయం వరకు ప్రతీ చోటా ముఖ్యమంత్రి ఫొటోలు ఏర్పాటు చేయటం ఆనవాయితీ. ఇక నుంచి ముఖ్యమంత్రితో పాటుగా డిప్యూటీ సీఎంగా పవన్ ఫొటోను కూడా ఏర్పాటు చేయాలని చంద్రబాబు సూచించారు.
అధికారుల ఎంపిక
పవన్ తన కార్యాలయంలో పని చేసేందుకు అధికారులను కొందరిని ఎంపిక చేసుకున్నట్లు తెలుస్తోంది. పవన్ కోరిన సిబ్బందిని కేటాయించేందుకు సాధారణ పరిపాలనా శాఖ అధికారులు సిద్దమయ్యారు.
శాసనసభా సమావేశాలు
పవన్ ఎంపిక చేసుకున్న శాఖలు పాలనా పరంగా కీలకమైనవి. తొలి సారిగా ఎమ్మెల్యేగా పవన్ కల్యాణ్ వచ్చే వారం మొదలయ్యే అసెంబ్లీ సమావేశాల్లో ప్రమాణ స్వీకారం చేయనున్నారు. మంత్రిగా సచివాలయంలో బాధ్యతలు చేపడుతూనే వరుసగా తన శాఖల పైన సమక్షలు నిర్వహించనున్నారు.
పవన్ పని తీరు పై ఆసక్తి
తొలి సారి మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తుండటంతో, పవన్ పని తీరు, తీసుకొనే నిర్ణయాల పైన రాష్ట్ర వ్యాప్తంగా అందరూ ఆసక్తిగా ఉన్నారు. కూటమి విజయం లో హీరోగా నిలిచిన పవన్, ఇప్పుడు మంత్రిగా ఎలా సక్సెస్ అవుతారనేది చూడాలి.